పెనుకొండ పట్టణంలోని ప్రగతి, గ్లోబల్ జెన్ పాఠశాలల్లో గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ యు. శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. బాలల దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం చిన్నారులు వేషధారణలు అందరిని ఆకట్టుకున్నారు. పిల్లలకు వివిధ పోటీలను నిర్వహించి, బహుమతులను మిఠాయిలను పంపిణీ చేశారు.