పెనుకొండ మండలం చంద్రగిరి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డీలర్ నాగరాజు గురువారం వంట పాత్రలు వితరణ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ విశ్వనాథ్, వైస్ చైర్మన్ గౌతమి మరియు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.