పుట్టపర్తిలో మీటర్ రీడింగ్ వర్కర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లాలోని ఎస్సీ కార్యాలయం వరకు కొనసాగింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మీటర్ రీడింగ్ యూనియన్ అధ్యక్షుడు షాన్వాజ్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు.