అఖిల భారత యువజన సమాఖ్య 22వ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాకాలరాజ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.