పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లిలో ఉన్న ప్రేమసాయి సేవ సదనం వృద్ధాశ్రమంలో పుట్టపర్తి సబ్ డివిజనల్ డీఎస్పీ విజయ్ కుమార్ మంగళవారం సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని పంచబక్ష పరమాన్నాలతో పాటు పండ్లను డిఎస్పి స్వయంగా వృద్ధులకు వడ్డించారు. వయసు దాటి చివరి అంకంలో ఉన్న వృద్ధులను పండుగ భోజనాన్ని స్వయంగా డిఎస్పి వడ్డించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.