గ్రామాల్లో కూలీలు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు సద్వినియోగం చేసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. శుక్రవారం రామగిరి మండలం మాదపురం గ్రామంలోని గ్రామ సభకు హాజరయ్యారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, భవిష్యత్ లో చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. అధికారులు కూలీలు వలసలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.