రాయదుర్గం: ఈతకు వెళ్లి యువకుడు మృతి

77చూసినవారు
రాయదుర్గం: ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఈతకు వెళ్లి యువకుడు మరణించిన ఘటన రాయదుర్గంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం పట్టణ శివారు ప్రాంతంలోని బీటీపీ లేఔట్లో కళ్యాణ్ రామ్ అనే యువకుడు తన స్నేహితులతో కాలనీ సమీపంలోని గుంతలో ఈతకెళ్లారు. కళ్యాణ్ రామ్ కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృత్యువాత పడినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్