రాయదుర్గం: కుక్కల బెడదతో ఇబ్బందుల్లో కాలనీ వాసులు

58చూసినవారు
రాయదుర్గం: కుక్కల బెడదతో ఇబ్బందుల్లో కాలనీ వాసులు
రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీ, సైన్పాల్ స్కూల్ కి వెళ్లేదారి, శాంతినగర్, కోతి గుడ్డం, గుమ్మఘట్ట రోడ్డులో కుక్కలు స్వైర విహారం చేస్తూ రహదారి వెంట వెళ్లే పిల్లలను, పెద్దలను కొరుకుతున్నాయని కాలనీవాసులు శనివారం విలేఖరులకు తెలిపారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లే పాదచారలను వెంటపడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్