జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాయలసీమ జోనల్ సెక్రటరీగా రాయదుర్గంకు చెందిన ఈశ్వరప్పను ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేఖరులకు తెలిపారు. గతంలో అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తనకు రాయలసీమ జోనల్ సెక్రటరీగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.