వెనుకబడిన ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం అని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అసెంబ్లీలో గురువారం పేర్కొన్నారు. జైసల్మేర్ ఎడారి అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారని, నియోజకవర్గంలో 20వేల ఎకరాల్లో ఎడారికన్నా దారుణ పరిస్థితులున్నాయన్నారు. సినిమాల్లో ఎడారి దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించుకుంటారన్నారు. ఎడారీకర నివారణ కోసం నిధులు కేటాయించాలని కోరగా, ఎడారీకరణ మంచి పదం అని డివై స్పీకర్ కితాబిచ్చారు.