రాయదుర్గం: ప్రతి నెల 1 నుంచి 15వ తేది వరకు రేషన్ వేయాలి

69చూసినవారు
రాయదుర్గం: ప్రతి నెల 1 నుంచి 15వ తేది వరకు రేషన్ వేయాలి
రాయదుర్గం పట్టణంలో రేషన్ బియ్యం కోసం ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు బుధవారం విలేఖరులకు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని ఉక్కడం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న మూడో నెంబర్ రేషన్ షాప్, 26, 27 వార్డులలో ఉన్న 19వ రేషన్ షాపులు మూసి వేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని రేషన్ వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల 1వ తేది నుంచి 15వ తేది వరకు రేషన్ వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్