రాయదుర్గం మండలం కాశీపురం జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం చేసి కాపర్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. గురువారం విద్యుత్ సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి దానిలో ఉన్న కాపర్ ను దొంగలించారని విద్యుత్ అధికారులకు తెలిపారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.