డి. హీరేహాల్ మండలం మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసి హారాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. ప్రత్యేకించి శ్రావణమాసం శనివారం రోజు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసం.