రాయదుర్గం: వివాహిత మహిళ చికిత్స పొందుతూ మృతి
పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి. హిరేహాల్ మండలం మురడి గ్రామానికి చెందిన వివాహిత శైలజ శుక్రవారం కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ గురుప్రసాద్ తెలిపారు. మురడి గ్రామానికి చెందిన శైలజ తన అక్క భర్త అయిన గంగాధర్ ను ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది. కుటుంబ కలహాలతో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.