రాయదుర్గం: రచ్చుమర్రి ఇసుక రీచ్ ను సందర్శించిన జేసి
కణేకల్ మండలం రచ్చుమర్రి గ్రామంలోని ఇసుక రీచ్ ను బుధవారం జేసీ శివ నారాయణ శర్మ ఆకస్మికంగా సందర్శించారు. ఇసుక రీచ్ లో కెమెరాల బిగింపు, ఇసుక నిల్వలు, తరలింపు ప్రక్రియ తదితర వివరాలను ఆర్డీవో వసంత్ బాబు, భూగర్భ గనుల శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ ఫణికుమార్లను అడిగి తెలుసుకున్నారు. ఇసుక రీచ్ పై టెండర్లు ఆహ్వానించినట్లు జేసీ తెలిపారు.