శింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలు బండారు శ్రావణి సూచన మేరకు..శనివారం రేషన్ డీలర్లు మానవత్వంతో నడవలేని వృద్ధులకు ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులను ఇంటి వద్దకే చేరుస్తున్నారు. శింగనమల మండల కేంద్రంలో మంచం మీద ఉన్న వృద్ధురాలికి రేషన్ బియ్యం, సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ మసూద్ వలీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్. శంకర్ పాల్గొన్నారు.