గార్లదిన్నె మండలంలో ఉచిత పశు వైద్య శిబిరాలను మంగళవారం పశువైద్యాధికారులు నిర్వహించారు. మండల పరిధిలోని కనుంపల్లి గ్రామంలో పశువైద్యాధికారి సుధాకర్ ఆధ్వర్యంలో పాడి పశువులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిబిరాలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.