నార్పల మండల కేంద్రం లోని కూతలేరు బ్రిడ్జి సమీపంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే బండారు శ్రావణి గురువారం స్థల పరిశీలన చేశారు. అనంతరం కూతలేరు వంకను ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిశీలించి, వంకలో నెలకొన్న పిచ్చిమొక్కలు, వ్యర్థాలను, చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.