భూముల రీ సర్వేపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెన్నప్ప యాదవ్ కోరారు. సోమవారం శింగనమల తహశీల్దార్ కార్యాలయంలో రైతుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేతో గ్రామాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చాలా మంది భూములు మరొకరి ఆధీనంలో ఉండటం, గట్ల వద్ద సమస్యలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయని తెలిపారు.