పెద్దవడుగూరు మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని నరసింహ కాలనీలో కుటుంబ కలహాలతో శేషు(38) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.