తాడిపత్రి డీఎస్పీగా రామకృష్ణుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న జనార్దన్ నాయుడు పదోన్నతిపై అదనపు ఎస్పీగా విజయవాడకు బదిలీ కాగా అతని స్థానంలో రామకృష్ణుడు ఇంటలిజెన్స్ నుంచి బదిలీపై తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని నూతన డీఎస్పీ తెలిపారు.