తాడిపత్రి: ఐదు మంది జూదరులు అరెస్ట్

75చూసినవారు
తాడిపత్రి మండలం గోసువారిపల్లి గ్రామ శివారులో జూదమాడుతున్న వారిని సోమవారం అరెస్ట్ చేసినట్లు రూరల్ సిఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. జూదమాడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి జూదమాడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20, 710/-రూపాయల నగదుతో పాటు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్