తాడిపత్రి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని ఊరుచింతల గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ శివగంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 48 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.