తాడిపత్రి: ఆలయాలను సందర్శించిన ఎస్పీ

52చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం, చిం తల వెంకటరమణస్వామి ఆలయం, మండలంలోని ఆలూరు రంగనాథస్వామి ఆలయాన్ని ఆదివారం ఎస్పీ జగదీష్ సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయాల చరిత్రను అర్చకులు ఎస్పీకి వివరించారు. అంతకుమునుపు ఎస్పీ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్