తాడిపత్రి పట్టణ పరిసరాల్లోని వరాలు తోట పెన్నావంతెన పై నరేష్ అనే యువకుడు ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని అనంతపురం పెద్దాసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడని సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.