వంతెనల వద్ద ఇసుక తరలింపు జరపకుండా చర్యలు చేపట్టండి

82చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది పరీవాహక ప్రాంతంలో వంతెనల వద్ద ఇసుక తరలింపు జరపకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ పట్టణ కార్య దర్శి చిరంజీవి యాదవ్ పేర్కొన్నారు. పెన్నా నదిలోని కొత్త బ్రిడ్జి నుంచి పాత బ్రిడ్జి వరకు ఇసుక రవాణా కాకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఇసుక తరలింపు వల్ల పెద్ద గోతులు ఏర్పడుతున్నాయని, ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్