తాడిపత్రి: మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి

84చూసినవారు
తాడిపత్రి: మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి
తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో దుకాణాదారులతో సమావేశం నిర్వహించారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తమవంతు కూడా కృషి చేయాలని తెలిపారు. చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకుని దుకాణం ముందు పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. చెత్తను బయట పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్