తాడిపత్రిలో న్యూ ఇయర్ సందర్భంగా ఆర్ రోడ్డు మార్గాల మీదుగా రాకపోకలు బంద్ చేస్తున్నట్లు మంగళవారం పోలీసులు పేర్కొన్నారు. పట్టణంలోని చుక్కలూరు బ్రిడ్జి నుంచి శివాలయం మీదుగా నంద్యాల రోడ్డుకు వెళ్లే మార్గాలలో భారీ వాహనాలు వెళ్లకుండా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. వాహనదారులు వేరే మార్గాలలో వెళ్లాలని సూచించారు.