ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరిస్తాం
ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరిస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కమీషనర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, డిష్ నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. తాడిపత్రిలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి లైసెన్స్ వుండాల్సిందేనన్నారు. జనవరి 1వతేదీ నాటికి వాహనదారులు లైసెన్స్, ఇన్సూరెన్స్‌లు చేయించుకోవాలన్నారు.