డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ మోహన్ రెడ్డిని అనుమతించకూడదు
డిక్లరేషన్ ఇవ్వకుండా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిరుమలకు అనుమతించకూడదని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు తాడిపత్రిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీవారి దర్శనం కోసం ఈనెల 28న తిరుమలకు వెళ్లాలని అనుకుంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎండోమెంట్-1 రూల్ నంబర్-16, జీఓ ఏంఎస్ నంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపారు.