ఉరవకొండ: రోడ్డు నిబంధనలు తప్పక పాటించాలి
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు బెళుగుప్ప, డి. హిరేహాల్ పోలీసులు బుధవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ శివ ఆధ్వర్యంలో బెళుగుప్ప సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. డి. హిరేహాల్ సీఐ గురుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఓబులాపురం సమీపంలోని హైవేలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని అవగాహన కల్పించారు.