ఉరవకొండ: ఘనంగా పంచమ జ్యోతుల ఉత్సవాలు
ఉరవకొండ పట్టణంలోని పెద్ద చౌడేశ్వరిదేవి పంచమజ్యోతుల ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అభిషేకం కోసం పవిత్ర గంగా జలాలను పంచకళశాలతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు హారతులు పట్టి పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహించి అమ్మవారి మూల విగ్రహానికి అభిషేకం నిర్వహించారు.