ఆటో బోల్తా - వ్యక్తి మృతి

83చూసినవారు
ఆటో బోల్తా - వ్యక్తి మృతి
వజ్రకరూర్ మండలం ధర్మపురి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేల్పుమడుగు నుండి పామిడి మండలం రామగిరికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో పైన కూర్చున్న పుల్లన్న(60) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి అనంతపురం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్