ఉరవకొండలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

65చూసినవారు
ఉరవకొండలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమికి ఇబ్బంది పడిన ప్రజలు.. మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. టవర్ క్లాత్ సర్కిల్ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అరగంట పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్