కూడేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కుష్టి వ్యాధిపై ఇంటింటా సర్వే కార్యక్రమం చేపడుతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. జనవరి 20 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పర్శలేని మచ్చలు రాగి రంగు మచ్చా, కుష్ఠు వ్యాధి కావచ్చు, ఎలాంటి లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.