పయ్యావుల కేశవ్ గెలవడంతో నేతల సంబరాలు

66చూసినవారు
పయ్యావుల కేశవ్ మరోసారి గెలవడంతో ఉరవకొండ శిరిడిసాయి బాబా ఆలయంలో అంబేడ్కర్ నగర్ కు చెందిన టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన తెదేపా శ్రేణులు పాల్గొని ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. బాబా విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు చేయించారు. పయ్యావుల నాయకత్వంలో భవిష్యత్తులో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్