పార్లమెంటు సమావేశాల్లో ఉరవకొండకి రైల్వేలైన్ ప్రతిపాదన చెయ్యాలని జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఇంచార్జ్ గౌతమ్ అనంతపురం పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణను శుక్రవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఉరవకొండ మీదుగా గుంతకల్లు, తుమకూరు స్టేషన్లను కలిపే ప్రతిపాదన ఉందని కానీ ప్రస్తుతం ఆ విషయమే మరుగున పడిపోయిందని ఎన్డీఏ ప్రభుత్వం ఉరవకొండ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కోరారు.