ఉరవకొండ: విద్యుత్ షాక్ కు గురైన యువకుడు మృతి

83చూసినవారు
ఉరవకొండ: విద్యుత్ షాక్ కు గురైన యువకుడు మృతి
కూడేరు మండలం చోళసముద్రానికి చెందిన చిట్రా శివ ప్రైవేట్ విద్యుత్ హెల్పర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత నెల 2న ఓ రైతు పొలంలో మరమ్మతుల కోసం వెళ్లిన ఆయన షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక ఆదివారం మృతిచెందాడు. శివకు భార్య ఆశ, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్