ఉరవకొండ: ఏఐఎస్ఎ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎంపిక

63చూసినవారు
ఉరవకొండ: ఏఐఎస్ఎ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎంపిక
ఉరవకొండ పట్టణంలో సోమవారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) మండల అధ్యక్ష కార్యదర్శులు ఎంపిక జరిగింది. మండల అధ్యక్షులుగా ఏరి స్వామి, మండల కార్యదర్శిగా చరణ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ విద్యార్థి సంఘం నియోజకవర్గ కన్వీనర్ భీమేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు తమ ఎన్నికకు సహకరించిన నియోజకవర్గ కన్వీనర్ భీమేష్, రాష్ట్ర అధ్యక్షులు వేమన కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్