విడపనకల్ మండలంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మిరప, వరి, టమాటా, వేరుశనగ పంటలు నీటి మునిగాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కూడా వర్షం కురియడంతో పంట పొలాలలో వర్షపు వరదనీరు నిలిచింది. దీంతో సుమారు 133 ఎకరాలలో పంట నీట మునగడంతో రూ.83 లక్షల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.