కార్తీక మాస చివరి ఆదివారం ప్రసిద్ధ శైవక్షేత్రం ఉరవకొండ గవిమఠం శోభాయమానంగా మారింది. చంద్రమౌళీశ్వరస్వామి సన్నిధిలో నిర్వహించిన లక్ష దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు చంద్రమౌళీశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో గవిమఠం డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, ఎస్ఐ జనార్ధన్నాయుడు పాల్గొన్నారు.