ఉరవకొండ పట్టణంలో పందులు రహదారుల్లో వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రోడ్డుపై వాహనాలకు అడ్డుపడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సమస్యను పంచాయితీ కార్యదర్శి గౌస్ సాబ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన శనివారం శానిటరీ సిబ్బందితో పందుల యజమానులకు నోటిసులు ఇప్పించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఊరికి దూరంగా పందులను పెంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి యజమానులకు సూచించారు.