ఉరవకొండ పట్టణం, చుట్టుపక్క గ్రామాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు మంగళవారం ఇళ్ళ ముందు రంగురంగు ముగ్గులు వేసి సంక్రాంతి కలను పరవశింప చేశారు. కొంతమంది మహిళలు రాత్రి రెండు గంటల సమయం వరకు ముగ్గులు వేశారు. మరి కొంతమంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఉంచి పూజలు కూడా నిర్వహించారు. సంక్రాంతి పండుగ రంగులమయంతో ఇంటింటా ఆనందాలు వెల్లువిరిసాయి.