విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ (26) అనే యువకుడు గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు బాబా ఫక్రుద్దీన్ కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.