బద్వేల్: "మాజీ మంత్రి వీరారెడ్డి సేవలు మరువలేనివి"

69చూసినవారు
బద్వేల్: "మాజీ మంత్రి వీరారెడ్డి సేవలు మరువలేనివి"
మాజీ మంత్రి స్వర్గీయ బిజివేముల వీరారెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని బద్వేల్ టీడీపీ నాయకులు జీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వీరారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వీరారెడ్డి ఘాట్ లో ఆయనకు బుధవారం నివాళులర్పించారు. గాజులపల్లి రమణరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బిజివేముల శివారెడ్డి, పి వేణుగోపాలరెడ్డి, జయరామిరెడ్డి, తక్కోలు రాంమోహన్ రెడ్డి, చరణ్, సూర్య, గణేష్, రామచంద్ర, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్