బద్వేల్: తప్పిపోయిన బాలుడు.. తల్లిదండ్రుల చెంతకు

57చూసినవారు
బద్వేల్: తప్పిపోయిన బాలుడు.. తల్లిదండ్రుల చెంతకు
తప్పిపోయిన మోదుగుల నరసింహ అనే బాలుడి ఆచూకిని కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టి అతని తల్లిదండ్రులకు బద్వేల్ అర్బన్ సీఐ రాజగోపాల్, ఎస్ఐ సత్యనారాయణలు అప్పగించారు. సోమవారం బద్వేల్ పట్టణంలోని కోటవీధికి చెందిన బాలుడు నరసింహ ఆడుకుంటూ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన పోలీసులు బాలుడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్