గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

62చూసినవారు
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
కలసపాడు మండలంలోని చింతలపల్లే గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న బుసగాని బాల చెన్నయ్య (28 ) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై చిరంజీవి శుక్రవారం తెలిపారు. చింతలపల్లే గ్రామానికి చెందిన బాలచెన్నయ్య అక్రమంగా గంజాయి బయట నుండి తెచ్చు కొని విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో దాడులు చేసి పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్