చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం పాఠశాలలో శనివారం సీఐడి అధికారుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఎస్సీ ఎస్టీ చట్టాలపై పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డి. ఎస్. పి సాయినాథ్, ఎస్సీ వెల్ఫేర్ ఈడి రాజ్యలక్ష్మి, ఆర్డీవో భవాని తదితరులు పాల్గొన్నారు.