కొండాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని వినాయక నిమజ్జనానికి నాలుగు ప్రాంతాలను పరిశీలించినట్లు ఆదివారం ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. కొండాపురం రైల్వే బ్రిడ్జి దగ్గర, తిమ్మాపురం చెరువు, పైడిపాలెం రిజర్వాయర్ దగ్గర, వెంకయ్య కాలువ గ్రామం దగ్గర చిత్రావతి నది ప్రదేశాలు నిమజ్జనానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. నిమజ్జనం సాయంత్రం 6 గంటలలోపు పూర్తిచేయాలన్నారు. నిమజ్జనం రోజు పట్టిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.