జమ్మలమడుగు: కన్యతీర్థంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవికి పూజలు

69చూసినవారు
జమ్మలమడుగు: కన్యతీర్థంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవికి పూజలు
జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కన్య తీర్థంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరీ సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కార్తీక మాసం కావడంతో ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.

సంబంధిత పోస్ట్